తిరుమల, 2025 అక్టోబరు 02 : శ్రీవారి బ్రహ్మోత్సవాలును విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ లోని అన్ని విభాగాలు సమిష్టిగా, సమన్వయంతో సేవలందించిట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయు డు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికా రుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తిరుమల అన్నమ య్య భవనంలో గురువారం చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు, అధికారులు, ఉద్యోగులు, జి ల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు, టీటీడీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 24 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రివర్యులు శుభాశీస్సులు అందజేశారు. ప్రపంచం నలుమూలల నుండి బ్రహ్మోత్పవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు 16 శ్రీవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించాం. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రూ.102 కోట్లతో నూతనంగా నిర్మించిన పీఏసీ-5 భవనంను, భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూలైన్ల నిర్వహణ కోసం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే పరికరాలను ప్రారంభించారు.
Recent Comments
No comments to show.